Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 57

Viswamitra becomes Rajarshi !!

|| om tat sat ||

బాలకాండ
ఏబది ఏడవ సర్గము
విశ్వామిత్రుడు రాజర్షి అగుట

తతః సంతప్తహృదయః స్మరన్ నిగ్రహమాత్మనః |
వినిశ్శ్వస్య వినిశ్శ్వస్య కృతవైరో మహాత్మనా ||

స|| తతః మహాత్మనా కృతవైరః ఆత్మనః నిగ్రహం ( కృత్వా) వినిశ్వస్య వినిశ్వస్య స్మరన్ సంతప్తహృదయః ( అభవత్)
తా|| అప్పుడు మహాత్మునితో వైరమునుపొందినవాడై ( జరిగిన పరాభవమునకు) తనను తాను నిగ్రహించుకొని పదే పదే నిట్టూర్చుచూ పరితపించెను.

స దక్షినాం దిశం గత్వా మహిష్యా సహ రాఘవ |
తతాప పరమం ఘోరం విశ్వామిత్రో మహత్ తపః|
ఫలమూలాశనో దాంతః చకార సుమహత్ తపః ||

స|| హే రాఘవ ! సః మహిష్యా సః దక్షిణాం దిశం గత్వా పరమం ఘోరం మహత్ తపః ఫలమూలాశనో దాంతః చకార సుమహత్ తపః తతాప ||

తా|| ఓ రాఘవ ! తన పట్టపురాణితో దక్షిణ దిశగావెళ్ళి ఫలమూలములే ఆహారముగా తీసుకొని ఘోరమైన గొప్ప తపస్సును చేసెను.

అథాస్య జజ్ఞిరే పుత్త్రాః సత్య ధర్మ పరాయణాః|
హవిష్యందో మధుష్యందో ధృఢనేత్రో మహారథః ||

స|| అథ అస్య పుత్త్రాః హవిష్యందో మధుష్యందో ధృడనేత్రో మహారథః సత్య ధర్మ పరాయణః జజ్ఞిరే ||

తా|| అచట ఆయనకు హవిష్యంద, మధుష్యంద,ధృఢనేత్ర, మహారథ అనబడు సత్య ధర్మ పరాయణులగు పుత్రులు కలిగిరి.

పూర్ణే వర్ష సహస్రే తు బ్రహ్మ లోక పితామహః |
అబ్రవీన్మధురం వాక్యం విశ్వామిత్రం తపోధనమ్||

స|| సహస్రే వర్ష పూర్ణే తు బ్రహ్మ లోక పితామహః విశ్వామిత్రం తపోధనం మధురం వాక్యం అబ్రవీత్ ||

తా|| ఒక వేయి సంవత్సరములు పూర్తి అయిన పిమ్మట లోక పితామహుడగు బ్రహ్మ తపోధనుడగు విశ్వామిత్రునితో మధురమైన వాక్యములను పలికెను.

జితా రాజర్షి లోకాస్తే తపసా కుశికాత్మజ |
అనేన తపసా త్వాంతు రాజర్షిః ఇతి విద్మహే ||

స|| హే కుశికాత్మజ ! హే రాజర్షి ! తే తపసా లోకాః జితా | త్వాం అనేన తపసా రాజర్షిః ఇతి విద్మహే తు |

తా|| "ఓ కుశికాత్మజ ! ఓ రాజర్షి ! నీ తపస్సుతో లోకములను జయించితివి. నీవు ఈ తపస్సుతో రాజర్షి అని గుర్తింపబడెదవు".

ఏవముక్త్వా మహాతేజా జగామ సహ దేవతైః |
త్రివిష్టపం బ్రహ్మలోకం లోకానాం పరమేశ్వర ||

స|| మహాతేజా లోకానాం పరమేశ్వరః ఏవం ఉక్త్వా దేవతాః సహ జగామ బ్రహ్మలోకం త్రివీష్టపం (చ) ||

తా||మహాతేజోవంతుడు లోకములకు పరమేశ్వరుడు అగు బ్రహ్మ దేవతలతో సహా బ్రహ్మలోకమునకు పోయెను. దేవతలు దేవలోకమునకు పోయిరి.

విశ్వామిత్రోపి తత్ శ్రుత్వా హ్రియా కించిదవాజ్ఞ్ముఖః |
దుఃఖేన మహతా విష్టః సమన్యురిదం అబ్రవీత్ ||

స|| తత్ శ్రుత్వా విశ్వామిత్రః అపి కించిద్ హ్రియా అవాజ్ఞ్ముఖః దుఃఖేన మహతా విష్టః సమన్యుః ఇదం అబ్రవీత్ ||

తా|| అది విని విశ్వామిత్రుడు కించపడి తల వంచుకొని దుఃఖముతో ఇట్లు పలికెను.

తపశ్చతు మహత్ తప్తం రాజర్షిరితి మాం విదుః |
దేవస్సర్షిగణాస్సర్వే నాస్తి మన్యే తపః ఫలమ్ ||

స|| మహత్ తపం తపశ్చతు దేవా ఋషి గణాః సర్వే రాజర్షి ఇతి మావిదుః | న తపః ఫలం అస్తి మన్యే||

తా|| మహత్తరమైన తపస్సు చేయబడినది. దేవతలు ఋషులు రాజర్షి అనియే నన్ను తలచెదరు. నాకు తపస్సు యొక్క ఫలము దక్కలేదని భావింతును.

ఇతి నిశ్చిత్య మనసా భూయ ఏవ మహాతపాః|
తపశ్చకార కాకుత్‍స్థ పరమం పరమాత్మవాన్ ||

స|| హే కాకుత్‍స్థ ! మహా తపాః ఇతి నిశ్చిత్య భూయ ఏవ పరమాత్మవాన్ మనసా పరమం తపః చకార ||వ్ద్

తా|| ఓ కాకుత్‍స్థ ! ఆ మహాతపోనిథి ఇట్లు ఆలోచించిమరల పరమాత్మను మనస్సుతో గొప్ప తపస్సు చేయసాగెను.

ఏతస్మిన్నేవ కాలేతు సత్యవాదీ జితేంద్రియః |
త్రిశంకురితి విఖ్యాతా ఇక్ష్వాకు కులవర్ధనః ||

స|| ఏతస్మిన్నేవ కాలే త్రిశంకురితి విఖ్యాతా సత్యవాదీ జితేంద్రియః ఇక్ష్వాకు కులవర్ధనః (ఆసీత్) ||

తా|| అదే కాలములో త్రిశంకుడు అని ఖ్యాతి పొందిన వాడు , సత్యవాది , జితేంద్రియుడు ఇక్ష్వాకు కులమును వర్ధింపచేయువాడు ఉండెను.

తస్య బుద్ధి సముత్పన్నా యజేయమితి రాఘవ|
గఛ్ఛేయం సశరీరేణ దేవానాం పరమాం గతిమ్ ||

స|| హే రాఘవ ! దేవానాం పరమాంగతిం స శరీరం గచ్ఛేయం యజేయం ఇతి తస్య బుద్ధిః సముత్పన్నా |

తా|| ఓ రాఘవ! దేవతలయొక్క నివాసమునకు తన శరీరముతో వెళ్ళుటకు యజ్ఞము చేయవలెనని అతనికి బుద్ధి పుట్టెను.

స వసిష్ఠం సమాహూయ కథయామాస చింతితమ్|
అశక్య మితి చాప్యుక్తో వసిష్ఠేన మహాత్మనా ||

స|| సః వసిష్ఠం సమాహూయ ( తస్య) చింతితం కథయామాస ! మహాత్మనా వసిష్ఠేన అశక్యమ్ ఇతి చ ఉక్తః ||

తా|| అతడు వసిష్ఠుని కలిసి తన కోరిక వెల్లడించెను. మహాత్ముడైన వసిష్ఠుడు అది అశక్తము అని చెప్పెను.

ప్రత్యాఖ్యాతో వసిష్ఠేన స యయౌ దక్షిణాం దిశమ్ |
తతస్తత్కర్మ్య సిద్ధ్యర్థం పుత్త్రాంస్తస్య గతో నృపః ||
వాసిష్ఠా దీర్ఘ తపసః తపో యత్ర హి తేపిరే|
త్రిశంకుస్సు మహాతేజాః శతం పరమభాస్వరమ్ ||

స|| వసిష్ఠేన ప్రతి ఆఖ్యాతౌ సః దక్షిణాం దిశమ్ యయౌ | తతః తత్ నృపః త్రిశంకుః సత్కర్మ సిద్ధ్యర్థం మహాతేజాః పరమభాస్వరం తస్య శతం పుత్త్రాం వాసిష్ఠా దీర్ఘ తపసః తపః యత్ర తేపిరే (తత్ర) గతః ||

తా|| వసిష్ఠుని చే నిరాకరింపబడిన వాడై అతడు దక్షిణ దిశలో వెళ్ళెను. అప్పుడు ఆ త్రిశంకు మహరాజు ఆ కోరిక తీర్చుకొనుటకై మహాతేజోవంతులైన దీర్ఘకాలముగా తపస్సు చేయుచున్న వసిష్ఠునియొక్క వంద మంది పుత్రులు ఎచట కలరో అచటికి పోయెను.

వసిష్ఠపుత్త్రాన్ దదృశే తప్యమానాన్ యశస్వినః|
సోs భిగమ్య మహాత్మనః సర్వానేవ గురో సుతాన్ ||

స|| సః అభిగమ్య యశస్వినః సర్వానేవ గురోః సుతాన్ తప్యమానాన్ వసిష్ఠ పుత్రాన్ దదర్శ |

తా|| ఆ యశోవంతుడు తపస్సు చేయుచున్న గురుపుత్రులను అందరినీ చూచెను.

అభివాద్యానుపూర్వేణ హ్రియా కించిదవాజ్ఞ్ముఖః |
అబ్రవీత్ మహాభాగాన్ సర్వానేవ కృతాంజలిః ||

స|| సర్వానేవ మహాభాగాన్ అభివాద్య అనుపూర్వేణ హ్రియా కించిద్ అవాజ్ఞ్ముఖుః కృతాంజలిః అబ్రవీత్ |

తా|| ఆ మహానుభావులందరికీ నమస్కరించి కొంచెము కించపడుతూ తలవంచుకొని అంజలి ఘటించి ఇట్లు పలికెను.

శరణం వః ప్రపద్యేsహం శరణ్యాన్ శరణాగతః|
ప్రత్యాఖ్యాతోస్మి భద్రం వో వసిష్టేన మహాత్మనా ||

స|| వః శరణ్యాన్ అహం శరణాగతః శరణం ప్రపద్యే | భద్రం వో | వసిష్ఠేన మహాత్మనా ప్రతి ఆఖ్యాతో అస్మి |

తా|| శరణు ఇవ్వగల మిమ్ములను నేను శరణు కోరుచున్నాను. మీకు భద్రమగుగాక . మహత్ముడగు వసిష్ఠుని చే నిరాకరింపబడితిని.

యష్టు కామో మహాయజ్ఞం తదనుజ్ఞాతు మర్హథ |
గురు పుత్త్రానహం సర్వాన్ నమస్కృత్య ప్రసాదయే ||

స|| మహాయజ్ఞం యష్టుం కామః | తత్ అనుజ్ఞాతుం అర్హథ | సర్వాన్ గురుపుత్త్రాన్ నమస్కృత్య అహం ప్రసాదయే |

తా|| మహాయ జ్ఞము చేయుటకు కోరిక గలవాడిని. దానికి మీ అనుజ్ఞ కోరుచున్నాను. గురుపుత్రులందరికీ నమస్కరించి మీ ప్రసాదము కోరుచున్నాను.

శిరసా ప్రణతో యాచే బ్రాహ్మణాంస్తపసి స్థితాన్|
తే మాం భవంతస్సిద్ధ్యర్థం యాజయంతు సమాహితాః |
స శరీరో యథాహం హి దేవలోకమవాప్నుయామ్ ||

స|| తపసి స్థితాన్ బ్రాహ్మణాం శిరసా ప్రణతో యాచే | తే సమాహితాః మాం భవంత సిద్ధ్యర్థం యాజయంతు | యథా అహం స శరీర దేవలోకమవాప్నుయామ్ ||

తా|| తపస్సు చేయుచున్న ఆ బ్రహ్మణులకు శిరస్సుతో నమస్కరించుచున్నాను. ఇక్కడ సమాహితులైన మీరు నాకోరిక తీర్చుటకు యజ్ఞము జరిపించుదురుగాక. నేను శరీరముతో దేవలోకమునకు వెళ్ళతలచితిని.

ప్రత్యాఖ్యాతో వసిష్ఠేన గతిమన్యాం తపోధనాః |
గురు పుత్త్రాన్ ఋతే సర్వాన్ నాహం పశ్యామి కాంచన ||

స|| వసిష్ఠేన ప్రతి ఆఖ్యాతః | సర్వాన్ గురుపుత్త్రాన్ ఋతే అన్యాం గతిం న అపశ్యామి |

తా|| వసిష్ఠునిచేత నిఅరాకరింపబడితిని . గురుపుత్రులగు మీరు అందరు తప్ప ఇంకోమార్గము నాకు కనుపడుటలేదు .

ఇక్ష్వాకూణాం హి సర్వేషాం పురోధాః పరమాం గతిం |

స|| సర్వేషాం ఇక్ష్వాకూనాం పురోధాః పరమాం గతిః ||

తా|| ఇక్ష్వాకులందరికీ పురోహితుడైన వశిష్ఠుడే మార్గము .

పురోధసస్తు విద్వాంసః తారయంతి సదా నృపాన్ |
తస్మాదనంతరం సర్వే భవంతో దైవతం మమ ||

స|| పురోధసః అస్తు విద్వాంసః (తే ) సదా నృపాన్ తారయంతి | తస్మాత్ అనంతరం సర్వే భవంతః ( ఏవ) దైవతం మమ ||

తా|| పురోహితులు విద్వాంసులు. ఎల్లప్పుడు రాజులను ఆదుకొంటారు. ఆ వసిష్ఠుని తరువాత మీరే నాకు దైవము ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే సప్త పంచాశ స్సర్గః ||

|| ఓమ్ తత్ సత్ ||

|| om tat sat ||